సిద్దిపేట, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. సీఎం, వ్యవసాయ శాఖ మంత్రే ఈ మరణాలకు బాధ్యులు.. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం సిద్దిపేట మారెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను ప రామర్శించారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. జగిత్యాల, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో నలుగురు రైతులు ప్రాణాలొదిరాని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో, కాంటా లు పెట్టడంలో, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో, బోనస్‌ను అందజేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ, అన్నదాతల ఆవేదనపై లేకపోవడం సిగ్గుచేటని మం డిపడ్డారు.
అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం డబ్బులు 48 గంటల్లోనే చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఉత్త మాటలే అయ్యాయని, 10 రోజులు దా టినా రైతులకు చెల్లించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న కాం గ్రెస్ ప్రభుత్వం, కేవలం 24.43 లక్షల టన్ను ల ధాన్యమే కొనుగోలు చేసిందని తెలిపారు. వివిధ కారణాలు చెప్పి 5 కిలోల దాకా తరు గు తీస్తుండటం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని పేర్కొన్నారు. పత్తి రైతులను ముంచి సీసీఐ అధికారులతో కలిసి దళారులు రూ.3,500 కోట్ల కుంభకోణం చేశారని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం ఇస్తామన్న ధాన్యం బోనస్ బోగస్ అయిందని, ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.515.82 కోట్లను రైతులకు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు చెల్లించింది సున్నా అని విమర్శించారు. ఆ బోనస్ సొమ్మును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దొడ్డు వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు
దొడ్డు వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కాన్‌కుర్తిలో సోమవారం రైతులు రోడ్డెక్కారు. దామరగిద్ద మండలానికి చెందిన రైతుల ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాం లేదని, కాన్కుర్తికి పంపగా.. అక్కడా రైతులకు నిరాశే ఎదురైంది. దీంతో ధర్నాకు దిగారు. దొడ్డు వడ్లు కొనే ఏర్పాట్లు చేస్తామని డీఎస్వో బాల్‌రాజ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
-దామరగిద్దl రాయిచూర్ హైవేపై రైతుల బైఠాయింపు
ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు సోమవారం నారాయణపేట జిల్లా వడ్వాట్ సమీపంలో రాయిచూర్ హైవేపై మండుటెండలో బైఠాయించారు. ధాన్యం లోడ్‌తో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ సురేశ్, ఎస్సై అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనాలని అధికారులు
మిల్లు యజమానిని ఆదేశించడంతో రైతులు ధర్నా విరమించారు. – మాగనూరు