నాగర్‌కర్నూల్, జూలై 27: రాష్ట్ర ప్రభు త్వం గురుకులాలను భ్రష్టుపట్టిస్తున్నదని, నాగర్‌కర్నూల్‌లోని ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో ఒకేసారి 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్‌రా వు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం రాత్రి ఫుడ్‌ఫాయిజన్ కారణంగా విద్యార్థులు ద వాఖాన పాలైన విషయం తెలుసుకొన్న ఆ యన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజుతో కలిసి ఆదివారం పాఠశాలను, దవాఖానను సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ విద్యార్థులను పరామర్శించేందుకు తాము వస్తున్నామని తెలిసి నయం కా కుండా వారిని బలవంతంగా డిశ్చార్జ్ చే యించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మొ న్నటికి మొన్న ఇదే జిల్లా పెద్దకొత్తపల్లి హాస్టల్లో కలుషితాహారం తిని పిల్లలు దవాఖాన పాలయ్యారని తెలిపారు. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ అస్వస్థతకు గురై విద్యార్థులు దవాఖాన పాలయ్యారని గుర్తుచేశారు. హుజూరాబాద్ బీసీ హాస్టల్ పిల్లల్ని ఎలుకలు కొరికాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 100మంది చిన్నారులు చనిపోయారని పేర్కొన్నారు.
రేవంత్ వచ్చాక అధోగతి
రేవంత్ వచ్చిన తర్వాత గురుకులాలను అధోగతి పాలు చేశారని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతానని ఇప్పటికీ టెండర్ పిలవలేదని హరీశ్‌రావు విమర్శించారు. కలుషిత ఆహారం పెడితే జైలుకు పంపుతానన్న రేవంత్ ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కలెక్టరేట్ పక్కనే ఉన్న గురుకుల పాఠశాలలో 111 మంది పిల్లలు దవాఖాన పాలైతే ఏం చర్యలు తీ సుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని చూస్తూ బీఆర్ఎస్ ఊరుకోదని, ప్రభుత్వంపై పోరాడతామని తెలిపారు. మళ్లీ గురుకుల బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. గురుకులాల్లో కల్తీ ఆహారం కేసులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించాలని కోరారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ పిల్లల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు. అనంతరం జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.