హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారి కావడి నరసింహకు సీబీఐ కోర్టు మూడేండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నరసింహపై 2006, డిసెంబర్ 21న సీబీఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
మిజోరం క్యాడర్లో పనిచేస్తున్న సమయంలో కేసు నమోదు కావడంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇరుపక్షాల వాదనల అనంతరం శుక్రవారం సీబీఐ కోర్టు నరసింహను దోషిగా తేల్చింది.