హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ శుక్రవారం మృతిచెందారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో ఆయన ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. పలు జిల్లాల కలెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.