హైదరాబాద్, మార్చి11 (నమస్తేతెలంగాణ): స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు కృషి చేయాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన ఈ విధానాన్ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ తొలగించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఎత్తివేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.