కరీంనగర్ తెలంగాణ చౌక్, జూలై 21 : రైతు లు కరువుతో అల్లాడుతుంటే రాజకీయ విమర్శ లు చేయడం సరికాదని సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయించి వెంటనే సాగు, తాగు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆ యన కరీంనగర్లో మీడియాతో మా ట్లాడారు.తెలంగాణ ఎత్తు మీద ఉన్నందున లిఫ్ట్ ద్వారానే నీటిని మళ్లించే అవకాశం ఉన్నదని సూచించారు. కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశర్వం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని అన్నారు. కేంద్ర నిపుణులు సూచనల ప్రకారం వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.