తాండూరు, ఆగస్టు 9: భర్త జ్ఞాపకాలను మొక్కలో చూసుకుంటున్న వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మిని బుధవారం హైదరాబాద్‌లో ఎంపీ సంతోష్‌కుమార్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్తపై ప్రేమ, మొక్కలపై మక్కువతో భర్త నాటిన మొక్కను ఇష్టంతో పెంచి చెట్టుగా ఎదిగేందుకు చొరవ చూపిన ఆమెను మొక్క అందజేసి సత్కరించారు.
చెట్టుకు ఏటా పుట్టినరోజు జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మానవ మనుగడకు అవసరమైన వృక్షాలను నాటి సంరక్షించాలని సూచించారు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. సేవకు ‘గ్రీన్ఇండియా చాలెంజ్’ అండగా ఉంటుందని తెలిపారు.