హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్ 1పై సీఎం రేవంత్రెడ్డి సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో గ్రూప్ 1 నియామక ఫలితాలు విడుదల చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారని, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగకముందే ఫలితాలెలా ఇస్తారని ప్రశ్నించారు. కొంపదీసి గ్రూప్ 1 పోస్టులు ఉంచారా? బేరం పెట్టుకున్నారా? అనే సందేహాన్ని వ్యక్తంచేశారు. సీఎం వ్యవహారం.. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్వై నాయకులు విద్యాసాగర్, మధు పాల్గొన్నారు.