హైదరాబాద్ జూలై 4 (నమస్తేతెలంగాణ): ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో నాడు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేన్లకు ర్యాటిఫికేషన్ చేయడం.. ఆయన కట్టిన ఫ్లైఓవర్లకు రంగులేయడం తప్పా కొత్తగా సాధించిందేమీలేదని స్పష్టంచేశారు. ఆందోళనకు దిగిన నిరుద్యోగులను నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడారు.