హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తేతెలంగాణ) : తమ ప్రాంతంలోని సమస్యలను, అవినీతిని సమాజానికి చూపించడం అనేది యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో ‘ముందడుగు’ యాప్ చేయబోతున్నదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం ముం దడుగు యాప్‌ను ఆయన ఆవిషరిం చి మాట్లాడారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో సమాజంలో జరుగుతున్న అవినీతి, ప్రజల సమస్యలు, నిజాయితీ వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు ‘ముందడుగు’ యాప్ ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
కార్యక్రమం లో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌం డర్ రాజేంద్ర పల్నాటి, ముందడుగు బృందం కొన్నె దేవేందర్, చెరుకూరి జంగయ్య, కోమటి రమేశ్‌బాబు, వరికుప్పల గంగాధర్, గీతానంద్ పాల్గొన్నారు.