మాజీ సీఎం నాదెండ్ల కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
- నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అంతిమ నివాళి అర్పించేందుకు వీలుగా ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో ఉంచనున్నారు. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో గురువారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
నాదెండ్ల మృతి పట్ల తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ ద్వారా రాకీయాల్లో ప్రవేశించారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1982లో టీడీపీలో చేరిన నాదెండ్ల భాస్కరరావు.. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు కొంత మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పీఠమెక్కి నెలరోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన నాదెండ్ల భాస్కరరావు.. 1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. భాస్కరరావు కుమారుల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీలో మంత్రిగా పనిచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

