ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరావ్ గూడే ఉద్యమకారిణి మృదులాపాటిల్, విద్యావేత్త ఆనంద్ మంజర్ఖేడే కూడా.. కున్బీసేన అధ్యక్షుడు సురేశ్ వార్షే సహా పలువురు మహారాష్ట్ర నేతల చేరిక
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రకంపనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో మాజీ ఎంపీ సహా మరికొంత మంది మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. అమరావతి నుంచి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అనంతరావు గూడేతో పాటు కున్బీ సామాజికవర్గానికి చెందిన కున్బీ సేన అధ్యక్షుడు సురేశ్ వర్షే, మోర్షి వరూధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మహిళా ఉద్యమ నాయకురాలు డాక్టర్ మృదులా పాటిల్, విద్యావేత్త, అడ్వొకేట్, సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ మంజర్ఖేడే తదితరులు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్లో చేరారు.