హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియ ల్ డిగ్రీ, జూనియర్ కాలేజీల పీడీ(ఫిజికల్ డైరెక్టర్), పీఈటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్) అసోసియేషన్ ఆదివారం ఆవిర్భవించింది. అసోసియేషన్ చైర్మన్‌గా డాక్టర్ రామలక్ష్మణ్, కో-చైర్మన్లుగా శేషుకుమారి, ఉదయభాసర్, ఆర్ లాలు,
గణపతి, ప్రెసిడెంట్‌గా నర్సయ్య, జనరల్ సెక్రటరీగా వీ చందర్, వరింగ్ ప్రెసిడెంట్‌గా డీ ప్రసాద్, ట్రెజరర్‌గా హరికిషన్, మహిళా విభాగం ప్రెసిడెంట్‌గా పీ నీరజ, జనరల్ సెక్రటరీగా జీ నాగమోహిని, వరింగ్ ప్రె సిడెంట్‌గా ఉదయశీల, ట్రెజరర్‌గా పీ సుశీల, డిగ్రీ విభాగం ప్రెసిడెంట్‌గా డాక్టర్ రమాదేవి తదితరులు ఎన్నికయ్యారు.