హైదరాబాద్ : రైతు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ( BRS ) పోరాటాలు చేస్తుందని, రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో మంత్రులు రైతు సమస్యలపై కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించి న రైతు సంగ్రామ సదస్సు విజయవంతం కావడంతో ప్రభుత్వం రైతు మేళా పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.కాంగ్రెస్ నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల మేళా పెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలను బస్సులో తీసుకొచ్చి మేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంకా ఇప్పటి వరకు50 శాతం కొనుగోళ్లు కొనలేదని విమర్శించారు. ఇంత వరకు రైతులకు బోనస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మహబూబాబాద్,భూపాలపల్లి జిల్లాలో తీవ్ర పంట నష్టం జరిగిందని, రైతులు చనిపోయినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. కేటీఆర్ రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టారని, కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ మీద ఎన్ని కేసులు పెట్టాలని తెలిపారు.