హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్(Nehru Zoo Park)షాద్ నగర్‌కు(Shad Nagar) తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అది పూర్తి అవాస్తవమని పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ మోహన్ పర్గేన్ తెలిపారు. జూపార్క్ తరలింపు ప్రక్రియ అంత సులువుగా జరగదని, ఈ ఊహాగానాలన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. వాటికి సంబంధించిన నూతన స్థల ప్రతిపాదనల అనుమతులు, నిర్ణయాలు సెంట్రల్ జూ అధారిటీ ఢిల్లీ నుంచి తీసుకోవాలన్నారు.
జూను తరలించడం ఆచరణాత్మకంగా చాలా సవాలుతో కూడుకున్నదని చెప్పారు. 1963లో స్థాపించిన ఈ జూ పార్క్ ఇటీవలే 60 ఏళ్లు పూర్తి చేసుకున్నదని తెలిపారు. ఇప్పటివరకు లక్షల మంది సందర్శకులకు ఆహ్లాదం పంచిన ఈ పార్క్ ప్రస్తుతమున్న చోటినుంచి మరే ఇతర ప్రదేశానికి తరలించాలనే ప్రతిపాదన కూడా తమకు లేదన్నారు.