లక్ష్మీదేవిపల్లి, జనవరి 3: కాంట్రాక్టర్ నుంచి అటవీ శాఖ అధికారి రూ.3.51 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన ప్రకారం.. టీఎఫ్‌డీసీ ప్లాంటేషన్‌కు సంబంధించి జామాయిల్ చెట్ల కటింగ్‌ను ఓ కాంట్రాక్టర్ చేయించి, వాటి బిల్లులు మంజూరు చేయాలని ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని కోరాడు. 32వేల టన్నుల జామాయిల్ చెట్లు కట్ చేసినందుకు తొలి విడతలో రూ.3.51 లక్షలు ఇస్తే సంతకం చేస్తామని వారు చెప్పడంతో.. ఏసీబీని ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ నుంచి ఫారెస్టు మేనేజర్ తాడి రాజేందర్, ప్రైవేట్ వ్యక్తి గోపాలకృష్ణ శనివారం రూ.3.51 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.