హైదరాబాద్, జనవరి13 (నమస్తే తెలంగాణ): కీలక సాగునీటి ప్రాజెక్టు లు పూర్తిచేసేందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.23వేల కోట్లు, ఇప్పటికే తీసుకున్న రుణాలు, అసలు చెల్లింపుల కు మరో 22వేల కోట్లు, మొత్తంగా రూ.45 వేల కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
కొత్తగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టు, పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, సీతారామ, చిన్నకాళేశ్వరం, ఇందిరమ్మ వరద కాలువ పథకాలను తొలి ప్రాధాన్యంగా తీసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నది. ప్రస్తు తం మొత్తంగా 13,935 కోట్ల బిల్లులు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెం డింగ్‌లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 10 వేల కోట్లు వెచ్చిస్తే 45 లక్ష ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుందని ప్రభుత్వం గుర్తించింది.