బిజినేపల్లి, అక్టోబర్ 21: పాఠశాలలో వడ్డించిన భోజనం విషతుల్యం కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం విద్యార్థులకు భోజనం వడ్డించారు. 15 మంది భోజనం చేయగా.. కొద్దిసేపటికే ఫుడ్ పాయిజన్ అయ్యి అఖిల్, లోకేశ్, శ్రీతేజ, లావణ్య, ప్రవల్లికతోపాటు మరో ఇద్దరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. స్థానికులు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పాలిటెక్నిక్‌లో ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 21: టీజీ ఎప్‌సెట్-2024 ఇంటర్మీడియట్(బైపీసీ) పూర్తయిన విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మాడీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ కోర్సులకు మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం హనుమకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభమైంది. సమస్యల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
పది మంది జీహెచ్‌ఎంల సస్పెన్షన్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 21: ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్పౌజ్, ఇతర క్యాటగిరీల్లో స్పౌజ్ పాయింట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని మహబూబ్‌నగర్ జిల్లా లో 10 మంది జీహెచ్ఎంలను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
బెటాలియన్ ఉద్యోగుల కుటుంబాల రాస్తారోకో
నీలగిరి, అక్టోబర్ 21 : పోలీస్ బెటాలియన్ విభాగంలో ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న రికార్డుల పద్ధతిని ఉపసంహరించుకోవాలని సోమవారం అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై నల్లగొండ జిల్లా అన్నెపర్తి 12వ బెటాలియన్ ఉద్యోగుల కుటు ంబ సభ్యులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బెటాలియన్‌లో కింది స్థాయి ఉద్యోగులను డ్యూ టీ విషయంలో పైఅధికారులు తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు.