గద్వాల, డిసెంబర్ 2 : జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని భీంనగర్ ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఫుడ్ పా యిజన్ అయింది. వివరాల్లోకి వెళితే.. భీంనగర్ ఎస్టీ బాలుర వసతిగృహంలో 120మంది విద్యార్థులు ఉంటున్నారు. ఉదయం విద్యార్థులు ఉప్మా తింటుండగా పురుగులు రావడంతో వసతిగృహ నిర్వాహకుడికి తెలుపడంతో వెంటనే ఆ ఉప్మాను పారబోయించారు. అనంతరం విద్యార్థులకు అరటి పండ్లు, బిస్కెట్లు ఇచ్చారు. వాటిని తిని విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. పాఠశాల లో ప్రార్థన చేస్తున్న సమయంలో మొదట ఇద్దరు విద్యార్థులు అ స్వస్థతకు గురయ్యారు.
ఆ తర్వాత మరో 12మంది అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు వారిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వసతిగృహంలో ఉన్న విద్యార్థులందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వెంటనే డిశ్చార్జి చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉప్మా ఉండలు కట్టి ఉండటంతో పురుగులు వచ్చాయని, దాన్ని తిన్న కొంతమంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కాంట్రాక్టర్ నాసిరకం సరుకులు సరఫరా చే యడంతోనే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని వాపోయారు.