పెద్దఅడిశర్లపల్లి, డిసెంబర్ 3 : నల్లగొండ జిల్లా పీఏపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్తో ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ నిర్వాహకులు వారిని దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఆదర్శ పాఠశాల వసతి గృహానికి కొద్ది రోజులుగా ఇన్చార్జి లేకపోవడంతో కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అన్నం వండే బియ్యం క్వాలిటీగా ఉండడం లేదని పలుమార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తహసీల్దార్ శ్రీనివాసులుతో విద్యార్థినులు వాపోయారు. మంగళవారం వండిన అన్నం చాలామంది తినకపోగా, తిన్నవారు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.