హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌కి పరిమితం చేయకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
స్వీపర్ల వేతనాలు పెండింగ్‌లో ఉంటే వాటికి సంబంధించిన వివరాలు వెంటనే పంపాలని సూచించారు. మిషన్ భగీరథ పనితీరుపై ఈ నెల 15లోగా నివేదిక ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అదనపు కార్యదర్శి హరిత, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాసర్ పాల్గొన్నారు.
సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసైనా మంచినీళ్లు సరఫరా చేయాలి: సీతక
అన్ని ఆవాస గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సీతక సూచించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశం సచివాలయంలో మంత్రి సీతక అధ్యక్షతన జరిగింది. రక్షిత మంచి నీరు అందని గ్రామాలను గుర్తించి తక్షణం పనులు ప్రారంభించాలని కోరారు.
అడవుల వెంట విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు కేంద్ర అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని, ఆ గ్రామాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బోర్ల ద్వారా నీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్కుమా ర్, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, తెలంగాణ రూరల్ డ్రింకింగ్ వాటర్ సైప్లె కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.