సంగారెడ్డి మే 8(నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వాహనాల తయారీలో కలిసి పనిచేయాలని టాటా టెక్నాలజీస్, ఐఐటీ హైదరాబాద్ నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు టాటా టెక్నాలజీస్‌కు చెందిన గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ విభాగం, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన టీహాన్(టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్) సోమవారం ఒప్పం దం కుదుర్చుకున్నాయి. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, టాటా టెక్నాలజీస్ ఎండీ, సీఈవో వారెన్ హారిస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. టాటా టెక్నాలజీస్‌తో కలిసి ఎస్డీవీలపై కలిసి పనిచేయటం శుభ పరిణామమని తెలిపారు.