శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 14:43:47

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

జోగులాంబ గద్వాల : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. నేడు డ్యాంకు 34,374 క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఔట్‌ఫ్లో 302 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో 18.274 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1598.85 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


logo