శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద వస్తున్నది. జూరాల నుంచి శ్రీశైలానికి 1.47లక్షలు, సుంకేశుల ప్రాజెక్టు నుంచి 1.31లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 840.1 అడుగులు కాగా.. పూర్తిస్థాయినీటిమట్టం 885 అడుగులు. డ్యామ్ పూర్తిస్థాయినీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 61.92 టీఎంసీలు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు 31,784 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది.