అయిజ, ఆగస్టు 28 : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఇన్‌ఫ్లో 9,100 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 5,297 క్యూసెక్కులుగా నమోదైంది. వరద తగ్గడంతో విద్యుత్తుఉత్పత్తి నిలిచిపోగా.. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.439 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 16,250 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 8,914 క్యూసెక్కులుగా నమోదైంది.
డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగాను ప్రస్తుతం 96.229 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు డ్యామ్ అధికారులుతెలిపారు. ఆర్డీఎస్ నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. దాహార్తి తీర్చేందుకు 10 రోజులపాటు తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయగా.. ఈ 25న ఆర్డీఎస్కు చేరాయి. ప్రస్తుతం 6.3 అడుగుల నీటిమట్టం ఉండగా, ప్రధాన కాలు వకు 265 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.