మా భూములు గుంజుకుంటే ఊరుకోం.. సిరిసిల్ల జిల్లా జిల్లెల్లలో దళిత రైతుల ధర్నా
‘దళితులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపా? మా భూములు గుంజుకుంటరా? భూభారతి రికార్డుల్లో మా భూములు మాయం చేసిన్రు. రైతు భరోసా, యూరియా ఇస్తలేరు. మా భూములు గుంజుకుంటమని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నరు’ అని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల దళిత రైతులు రోడ్డెక్కారు.
తంగళ్లపల్లి, సెప్టెంబర్ 23 : ‘దళితులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపా? మా భూములు గుంజుకుంటరా? భూభారతి రికార్డుల్లో మా భూములు మాయం చేసిన్రు. రైతు భరోసా, యూరియా ఇస్తలేరు. మా భూములు గుంజుకుంటమని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నరు’ అని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల దళిత రైతులు రోడ్డెక్కారు. బుధవారం గ్రామంలోని సిరిసిల్ల – సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో తమకు 40 ఎకరాల భూములు కేటాయించారని, పట్టా ప్రొసీడింగ్స్ ఇచ్చి రైతుబంధు వేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తమకు కష్టాలు మొదలయ్యాయని, భూము ల వివరాలు ఆన్లైన్లో మాయం చేశారని వాపోయారు. ‘మా సీఎం వస్తుండు.. మీ భూములు గుంజుకుంటం’ అంటూ స్థానిక కాంగ్రెస్ నేత బెదిరిస్తున్నారని, అధికారులను అడ్డం పెట్టుకుని పట్టాలు రద్దు చేయించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ భూముల ను భూభారతిలో నమోదు చేయాలని, లేదం టే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

