హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు దారిమళ్లించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్ నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో అప్రమత్తమైన పైలట్లు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానాన్ని నేరుగా బెంగళూరుకు తీసుకెళ్లారు.