జనగామ చౌరస్తా, మే 22: జనగామ జిల్లా(Janagama district పేరును మార్చొద్దని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఫ్లెక్సీని దహనం(Flexi cremation) చేశారు. జిల్లా జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ జిల్లా పేరు మార్పు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
లేకుంటే కాంగ్రెస్ పార్టీని జనగామ నుంచే భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వెంటనే స్పందించాలన్నారు. జిల్లా పేరు మార్పు జరగకుండా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. అంతకు ముందు జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా పేరు మార్పుపై ప్రజలెవరూ ఒప్పుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు గన్ను కార్తీక్, నల్ల రాహుల్, తుంగ కౌశిక్, వెంపటి అజయ్, గద్ద సాయికుమార్, సల్ల మహేశ్, మద్దెల కార్తీక్, చిటుకుల అశోక్, ఆఫ్రోజ్, దినేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.