ఓవర్ టైం పని గంటలు పెంచుతూ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. 3 నెలలకు 70 గంటలుగా ఉన్న ఓవర్ టైమ్ డ్యూటీని 156 గంటలకు పెరగనున్నాయి. రాత్రిళ్లు పురుషులతో సమానంగా మహిళలు విధులు నిర్వహించడంతోపాటు, వారితో సమానంగా వేతనం పొందేలా బిల్లును రూపొందించింది. రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్తు ఉండడంతో ఈ పనిగంటల పెంపు విధానం కంపెనీలు, ఫ్యాక్టరీలకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాత్రిళ్లు మహిళలు పనిచేసే చోట మౌలిక వసతులు కచ్చితంగా కల్పించాలని, వారికి రవాణా, ఇతర భద్రత పరమైన విషయాలు కూడా కంపెనీలే చూసుకోవాలని, ప్రసూతి నిబంధనలను తప్పకుండా కంపెనీలు పాటించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వ ర్, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ప్రవేశపెట్టిన ఐదు బిల్లులకు స్పీకర్ ఆమోదం తెలిపారు. వీటిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) యాక్ట్-2023, ఫ్యాక్టరీల (తెలంగాణ సవరణ) బిల్లు, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వర్గాల కమిషన్ (సవరణ) బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ రెండో సవరణ బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొం దాయి. ఈ ఐదు బిల్లులపై చర్చించేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా సభలో లేరని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులపై మాట్లాడలేని వారు ప్రతిపక్షంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) యాక్ట్-2023
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు నిమ్స్, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లపై ప్రజలు ఆధారపడుతుండటంతో వారికి అవసరమైన సూపర్ స్పెషలిటీ సేవలను అందించేందుకు టిమ్స్ దవాఖానల ఏర్పాటు కోసం టిమ్స్ యాక్ట్-2023’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. 1,000 పడకల సూ పర్ స్పెషలిటీ దవాఖాన, ఎయిమ్స్ మాదిరి స్వ యం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థ, స్పెషాలిటీ-సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, స్పెషాలిటీ – సూపర్ స్పెషాలిటీలో వైద్య విద్య, 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీలలో పీజీ కోర్సులు, పారామెడికల్ విద్య, గుండె, కిడ్నీ, లివర్, మెద డు, ఊపిరితిత్తుల వంటి 30 విభాగాలు ఏర్పా టు చేసి ప్రజలకు వైద్యం అందించడం బిల్లులోని ప్రధాన అంశాలు.
మైనార్టీ వర్గాల కమిషన్ (సవరణ) బిల్లు
ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, పార్సీలతోపాటు జైనులకు కూడా మైనార్టీ హో దా ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది దేశంలో ఇప్పటివరకు 15 రాష్ట్రాలు మైనారిటీ కమ్యూనిటీ క్యాటగిరీ కింద జైన్ కమ్యూనిటీని నోటిఫై చేశాయని మంత్రి కొప్పుల తెలిపారు. ఇక నుంచి తెలంగాణలో నూ ముస్లింలు, క్రైస్తవులు, సికులు, బౌద్ధులు, పార్సీలతో పాటు జైనులు కూడా మైనార్టీగా ఉంటారని తెలిపారు.
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు
వస్తు రవాణా, ఎలక్ట్రిక్ గూడ్స్ వ్యాపారంలో నేరాలను అరికట్టేందుకు, పన్ను ఎగతవేత దా రులను తగ్గించేందుకు, జీఎస్టీ కౌన్సిల్లో చిన్న చిన్న నేరాలను కూడా నేరరహితం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యా క్స్ సవరణ బిల్లు-2023 బిల్లుప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సెల్ 47, 48 సెక్షన్లలో కొన్ని సవరణలు చేశారు. ఎలక్ట్రానిక్స్, కామర్స్ వ్యాపారాలు చేసే వ్యక్తుల టర్నోవర్ పరిమితి కంటే తక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్స్, కామర్స్ ఆపరేటర్లకు జరిమానా నిబంధనలు వర్తింపజేసేలా ప్రతిపాదించారు.
పంచాయతీరాజ్ రెండో సవరణ బిల్లు
రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు, జాతుల, జ నాభా నిష్పత్తి ప్రాతిపదికన వారికి అనుకూలం గా గ్రామ పంచాయతీలను, మండల ప్రజా ప్రతినిధులను, జిల్లా ప్రజాప్రతినిధులను, సీట్లు/వార్డు/పదువులలో రిజర్వేషన్ కల్పించడానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో వివరంగా రూపొందించింది. ఆ చట్టంలోని 3, 7 సెక్షన్లలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, జనాభా ప్రాతిపదికన ప్రజా ప్రతినిధుల ఎంపిక, 8వ షెడ్యూల్‌ను చేర్చడం/మార్చడం, వివిధ జిల్లాలు, మండలాలు క్రమ సంఖ్యలు, కొత్తపేర్లు, మార్పులు, చేర్పులు, సర్వే నంబర్ల మార్పు కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 22 జిల్లాల నుంచి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు, విస్తీర్ణం, సర్వే నంబర్లు మా ర్పు కోసం ఈ సవరణ బిల్లును పెట్టారు.
మండలిలో నాలుగు బిల్లుల ఆమోదం
శాసనమండలి శనివారం నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపించడంతో ప్రభుత్వం వాటిని సభలో ప్రవేశపెట్టి మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర పాలక సంస్థల్లో కోఆప్షన్ సభ్యుల సంఖ్య 5 నుంచి 15 పెంపు, వైద్య ప్రొఫెసర్ల పదవీ కాలం 61 నుంచి 65 ఏండ్లకు పొడిగింపు బిల్లులను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, భద్రాచలం గ్రామ పంచాయతీని కొత్తగా మరో రెండు పంచాయతీల ఏర్పాటు బిల్లును పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. ఈ నాలుగు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది.