హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : 104 సర్వీస్‌లో పనిచేస్తున్న ఫార్మసీ ఆఫీసర్లకు కంటిన్యూవేషన్ ఇచ్చి పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం కోఠిలో 104 ఫార్మసీ ఆఫీసర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 17 ఏండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమసేవలను గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కే శరత్‌బాబు, జాలిగామ అశోక్, గాదె శ్రీనివాస్, వైకుంఠం, నారాయణ, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.