MLC Elections | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువీకరణపత్రాలు అందజేయనున్నారు.
ఈ నెల 29తో పదవీకాలం ముగియనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. ఐదు స్థానాలకుగాను బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్, మిత్రపక్షమైన సీపీఐ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమమైనవిగా తేలింది. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నిక అయినట్టు ప్రకటిస్తారు.