జడ్చర్ల టౌన్, జూలై 31 : అమ్మానాన్న ఆట పేరిట ఐదుగురు మైనర్లు ఏడేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్నది. ఇందులో బాలిక సోదరుడు కూ డా ఉండటం అందరిని విస్తుగోలుపుతున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీలో బాలికతోపాటు మరో ఐదుగురు బాలురు ఇంట్లో అమ్మానాన్న ఆట అంటూ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు.
దీంతో బాలిక అస్వస్థతకు గురైంది. బాలికను తల్లి దవాఖానకు తీసుకెళ్లగా.. లైంగికదాడి జరిగినట్టు డాక్టర్లు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా, బాలిక సోదరుడు కూడా ఉండటం గమనార్హం. మైనర్లు కావటంతో వారిని అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించినట్టు జడ్చర్ల సీఐ కమలాకర్ తెలిపారు.