హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రులుగా గురువారం ఐదుగురు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్తు శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా శ్రీధర్‌బాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ, సమాచార పౌరసంబంధాలు, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉదయం 9 గంటల్లోగా బాధ్యతల స్వీకరణ ముగించనున్నారు.