హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో శనివారం ఐదు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వరంగల్, జనగామలో ఒక్కొక్కరు, వికారాబాద్లో ముగ్గురు విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు.
శనివారం నాటి పరీక్షకు 12వేల మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.