హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ రేణుక యార, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ, జస్టిస్ తిరుమలాదేవి ఈద, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావును శాశ్వత న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది.
ఈ మేరకు కొలీజియం మంగళవారం నిర్ణయం తీసుకున్నది. 2012లో జిల్లా జడ్జిలుగా ఎంపికైన ఈ ఐదుగురు 2025 జనవరిలో హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.