చింతలమానేపల్లి, ఫిబ్రవరి 26 : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా నిల్వ ఉంచిన రూ.21లక్షల విలువైన మద్యాన్ని మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెంలో పోలీసులు పట్టుకున్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం బుధవారం చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రెస్మీట్లో వివరాలు వెల్లడించారు.
ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గూడెం సమీపంలోని వైస్షాప్ దగ్గర కౌటాల సీఐ రమేశ్, ఎస్ఐలు ప్రవీణ్, మధుకర్, నరేశ్ తనిఖీ చేశారు. పక్కనే రూములో నిల్వ ఉంచిన మద్యం కాటన్లు గుర్తించారు. 3 బెల్ట్ షాపులు తనిఖీ చేయగా మద్యం లభించింది. 700 కాటన్ల మద్యం, బీరు సీసాలు పట్టుబడ్డాయి. వీటి విలువ 21,50,890 ఉంటుందని, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు.