హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ బడి బస్సులకు పర్మిట్లు, ఫిట్నెస్ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఎట్టి పరిస్థితుల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను రవాణా చేయరాదని వెల్లడించింది. బడుల ప్రారంభం నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం పలు ఆదేశాలు జారీచేశారు.
అనుభవం, అర్హత, శిక్షణ పొందిన డ్రైవర్లను మాత్రమే నియమించాలని, అన్ని రకాల భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన బడులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.