స్వరాష్ట్రంలో ముది‘రాజు’లు
ఉమ్మడి పాలనలో చెరువులు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన మత్స్యకారులు రోడ్డున పడ్డారు. ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై వలసబాట పట్టిన వారెందరో. స్వరాష్ట్రంలో ఊరి చెరువుకు జీవమొచ్చింది.
- పెరిగిన నీటి వనరులు.. ఊరూరా మత్స్యసిరులు
- కుల వృత్తిదారులకు ఉపాధి భరోసా
- అన్నింటా తెలంగాణ సర్కారు అండ
- నేడు మత్స్యకార దినోత్సవం
ఉమ్మడి పాలనలో చెరువులు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన మత్స్యకారులు రోడ్డున పడ్డారు. ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై వలసబాట పట్టిన వారెందరో. స్వరాష్ట్రంలో ఊరి చెరువుకు జీవమొచ్చింది. మిషన్ కాకతీయతో పూర్వవైభవం వచ్చింది. కాళేశ్వరంతో జలసిరులు ఉప్పొంగి నీలి విప్లవం ఎగిసిపడింది. ముదిరాజ్‌లకు ప్రాణమొచ్చింది. తిరిగి పల్లెబాట పట్టించింది. మండుటెండల్లోనూ ఒడవని నీళ్లు. పట్టవశం గాని చేపలు. చేతినిండా ఉపాధి. జేబునిండా ఆదా యం. స్వరాష్ట్రంలో ముది’రాజు’లు సగర్వంగా జీవనం సాగిస్తున్నారు. సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): చెరువు బతుకు ఆదరువు. ఊరుమ్మడి బతుకు చిత్రం. కానీ, వలస పాలకుల కుట్రల తో చెరువు నిర్లక్ష్యానికి గురైంది. జలదోపిడీకి బలిపశువుగా మారింది. పూడిక చేరి, కట్టలు కరిగి.. నీరు లేకుండా బోసిపోయింది. తెలంగాణ పల్లె బతుకు ఛిద్రమైంది. మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టింది. వలసబాట పట్టించింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ ఉద్యమ నినాదమైంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన వెంటనే కేసీఆర్.. తొలిప్రాధాన్యంగా చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని 46,531 చెరువుల పునరుద్ధరణకు నడుం కట్టారు. మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టి నవ తెలంగాణకు పునాది వేశారు. ఇప్పటివరకు నాలుగు దశల్లో రూ.9155 కోట్లతో 27,584 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆ చెరువులు పూర్వవైభవం సంతరించుకొని, మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చాయి.
దళారుల దోపిడీకి చెక్
సమైక్య పాలనలో చెరువులు చాలావరకు దెబ్బతిన్నాయి. కొద్దోగొప్పో ఉన్నా.. వాటితో మత్స్యకారులకు ఒరిగింది శూన్యమే. మత్స్యకారులే చేపపిల్లలను కొనుక్కొని చెరువుల్లో పోసుకోవాల్సిన దుస్థితి. ఆర్థిక స్థోమత లేక అనేక సొసైటీలు గుత్తేదారులను ఆశ్రయించేవి. పిల్లలు పెరిగాక సొసైటీకి నామమాత్రపు ధరతో చేపలు పట్టుకుపోయేవారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి పోయింది. ప్రభుత్వమే చేపపిల్లలను ఉచితంగా సరఫరా చేస్తున్నది. చేపల ను దళారులకు అమ్మకుండా మత్సకారులే నచ్చిన ధరకు విక్రయిస్తూ బలోపేతమవుతున్నారు.
మార్కెటింగ్ సౌకర్యం
చేపల అమ్మకానికి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తున్నది. సమీప పట్టణాలకు వెళ్లి విక్రయించుకునేందుకు బైకులు, ఫోర్‌వీలర్లను సబ్సిడీపై అందజేస్తున్నది. రూ.7.60 కోట్లతో రాష్ట్రంలో 784 అధునాతన చేపల మార్కెట్లను ఏర్పాటు చేసింది.
పారిశ్రామిక అభివృద్ధి దిశగా చేపల పెంపకం
చేపల పెంపకాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. చెరువుల పునరుద్ధరణతో 8 టీఎంసీల నీరు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదుల సంఖ్యలో కొత్త రిజర్వాయర్లను నిర్మించడం ద్వారా మరో 136 టీఎంసీల నీరు అందుబాటులోకి రానున్నది. రాష్ట్రంలోని నీటి వనరులపై మత్స్యకారులకే హక్కులను కొనసాగిస్తూ, వారి భాగస్వామ్యంతో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నది. తద్వారా ముదిరాజ్‌లకు అదనపు ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడడంతోపాటు, ఆదాయం కూడా రెట్టింపు చేయాలనే దిశగా చర్చలు కొనసాగిస్తున్నది.
కేసీఆర్ హయాంలో సాధించిన విజయాలు..
- కోకాపేటలో ముదిరాజ్ భవనం కోసం రూ.300 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలం, రూ.5 కోట్ల నిధుల మంజూరు.
- ముదిరాజ్ అనే పదాన్ని మత్స్యకారులుగా మార్చి 58 ఏండ్లుగా వారు పడుతున్న ఇబ్బందిని తొలగింపు.
- జీవో నంబర్ 6 ద్వారా ఒక ఎకరానికి ఒక సభ్యత్వం చొప్పున మత్స్యకారుల సభ్యత్వాన్ని గణనీయంగా పెంచడం.
- వెయ్యి కోట్ల బడ్జెట్ 75 శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాల అమలు.
- రూ.450 కోట్లతో 63 వేల బైకులు, 3,200 మినీ వాహనాలు మంజూరు.
- 18 ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు మత్స్యకార సభ్యత్వం..
- ఏటా ఉచితంగా చేపపిల్లలు, రొయ్యల పంపిణీ. ఇప్పటికే 500 కోట్ల ఖర్చు.
- జీవో 268 ద్వారా పంచాయతీ చెరువులు మత్స్యశాఖకు బదలాయింపు.
- 75 కోట్లతో మత్స్యకారులకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం. మత్స్యకారుల ప్రమాద బీమా రూ.6 లక్షలకు పెంపు.
- 3 నెలల్లోనే దాదాపు రూ.1000 నూతన ముదిరాజ్ మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేయడం.
- మహిళా మత్స్య కార్మికులకు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.7.5 కోట్లు ఇవ్వడం.
తెలంగాణ మత్స్యశాఖ స్వీకరించిన అవార్డులు..
- చెరువుల్లో చేపల పెంపకంలో దేశంలోనే తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. నిరుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్‌ప్రైజ్‌ను సొంతం చేసుకున్నది.
- 2021కి దేశంలో తెలంగాణ మత్స్యశాఖ అగ్రి-ఫుడ్ ఎంపవర్మెంట్ అవార్డును అందుకొన్నది.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

