వరంగల్ : హనుమకొండలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. యూకే నుంచి డిసెంబర్ 2వ తేదీన హనుమకొండకు వచ్చిన 40 ఏండ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే లలితా దేవీ శుక్రవారం వెల్లడించారు. చికిత్స నిమిత్తం లలితా దేవీని గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించామని తెలిపారు.
ఈ నేపథ్యంలో దేవీ కుటుంబ సభ్యులతో పాటు బంధువుల శాంపిళ్లను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని చెప్పారు. ఆమె నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ను ఐసోలేట్ చేశామన్నారు. దేవీ ఉంటున్న అపార్ట్మెంట్లో 26 మంది ఉంటున్నట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. మొత్తంగా తెలంగాణ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరుకున్నది.