Fire Incident | ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదం కారణంగా పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
Fire Incident | హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నుమా( Falaknuma Express)ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి(Fire) గురికావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు రైళ్లను రద్దు(Trains Cancelled) చేశారు.
హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నుమా( Falaknuma Express)ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి(Fire) గురికావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు రైళ్లను రద్దు(Trains Cancelled) చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు(Route Divert) వెల్లడించారు . సికింద్రాబాద్-రేపల్లె, సికింద్రాబాద్-మన్మాడ్ (అజంతా ఎక్స్ప్రెస్)రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు.
సికింద్రాబాద్ – తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్(వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్-హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా మళ్లించారు. యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని ఒక బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు చైన్ లాగడంతో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు.
రైలు బోగీల్లో ఉన్న ప్రయాణికులను రైలులో నుంచి దించివేశారు. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అయితే మంటలను ఆర్పే సిబ్బంది వచ్చేలోపే క్రమంగా మిగతా బోగీలకు నిప్పంటుకుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఐదుబోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక బోగి పాక్షికంగా కాలిపోయింది.
ఆరో బోగీ వద్ద ఉన్న జాయింట్ తొలగించడంతో మంటలు ఇతర బోగీలకు వ్యాప్తి చెందకుండా నిలుపుదల చేశారు. అదక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ నుంచి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

