ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో మంటలు
ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్డులోని రూబీ హోటల్ కింది అంతస్థులో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
- పై అంతస్థులోని లాడ్జీకి వ్యాపించిన అగ్నికీలలు
- ఏడుగురి మృతి.. నలుగురి పరిస్థితి విషమం
బేగంపేట, సెప్టెంబర్ 12 : ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్డులోని రూబీ హోటల్ కింది అంతస్థులో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల తెలిపిన ప్రకారం..రాత్రి 10 గంటల సమయంలో ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనంలోని మూడు అంతస్థులకు వ్యాపించాయి. రూబీ హోటల్లోనే లాడ్జి కూడా ఉండటంతో కొందరు భయంతో బాత్రూమ్ కిటికీల నుంచి పైపులు పట్టుకొని కిందకు దిగగా, మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఘటన జరిగిన సమయంలో భవనంలో 23 మంది వరకు ఉన్నారు.
ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో ఓ వాహనం బ్యాటరీ పేలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. రాత్రి 12 గంటల వరకు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రమాద బాధితులను గాంధీ, యశోద దవాఖానలకు తరలించారు. వీరిలో ఏడుగురు మృతి చెందినట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. లాడ్జిలో ఎక్కువ శాతం పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

