హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిరుడు ఫైర్‌కాల్స్ తగ్గాయి. 2023లో అగ్నిప్రమాదాల్లో 44 మంది చనిపోగా, ఈ ఏడాది 23 మంది మరణించినట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం అగ్నిమాపకశాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది 63 మందిని అగ్నిప్రమాదాల నుంచి కాపాడినట్టు వెల్లడించారు. గతేడాది 7,400 ఫైర్‌కాల్స్ రాగా, ఈ ఏడాది 7,383 వచ్చినట్టు తెలిపారు. నిరుడుతో పోల్చితే మీడియం ఫైర్‌కాల్స్ 10శాతం పెరిగినట్టు నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది అనూహ్యంగా వచ్చిన వరదల్లో 1,767 మందిని రెస్క్యూ చేసినట్టు తెలిపారు. అగ్నిప్రమాదాల్లో కాకుండా ప్రమాదశాత్తు చనిపోయిన 435 మంది డెడ్‌బాడీలను అగ్నిమాపకశాఖ సిబ్బంది రికవరీ చేసినట్టు చెప్పారు. మొత్తంగా 15,78,433 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. అగ్నిమాపకశాఖ ట్రైనింగ్ అకాడమీని రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రంలో 2వే ల మందితో ఎస్డీఆర్ఎఫ్ను రూపొందించామని తెలిపారు. అడిషనల్ ఫైర్ డైరెక్టర్ ప్రసన్నకుమార్, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్, ఆర్ఎఫ్వో హరినాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.