Seven Hills Express | తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (Seven Hills Express) రైలుకు ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ 1279 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో రాత్రి 8.55 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలో రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వెనక ఉన్న గార్డు.. లోకో పైలెట్‌ను అప్రమత్తం చేశారు.
దీంతో లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. బోగీ చక్రాల వద్ద రేగిన మంటలను గార్డు ఆర్పేశారు. ఈ కారణంగా దాదాపు అరగంట పాటు రైలు అక్కడనే నిలిచిపోయింది. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.