Medak | చేగుంట, నవంబర్ 12 : మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూల్ బస్సు డ్రైవర్, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రామాయంపేటకు చెందిన అక్షర టెక్నో స్కూల్ బస్సు.. రోజు మాదిరిగానే విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చింది. అనంతరం స్థానికంగా ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం వద్ద బస్సును పార్కింగ్ చేశాడు డ్రైవర్. కాసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నికీలలు ఎగిసిపడ్డ సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.