జగిత్యాల: జగిత్యాల జిల్లా (Jagtial) మెట్పల్లి మండలం వెంకటరావుపేటలో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ (Diesel Tankar) వెంకటరావుపేట వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ట్యాంకర్ బోల్తపడి భారీగా మంటలు చెలరేగాయి. భయాందోళనలకు గురైన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.
హైవేపై ప్రమాదం జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఘట్కేసర్ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట బంకుకు డీజిల్ తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసకున్నదని పోలీసులు తెలిపారు.