మాగనూరు, ఏప్రిల్ 28 : ఈతవనం దగ్ధమైన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం భైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. భైరంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారని గీత కార్మికుల అనుమానిస్తున్నారు. కల్లుగొబ్బలను ధ్వంసం చేసిన ఘటనపై నారాయణపేట ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రెండువేలకుపైగా ఈతచెట్లు కాలి బూడిదైనట్టు వారు పేర్కొన్నారు.