హైదరాబాద్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో (Rajendranagar) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్లోని సన్సిటీ (Suncity) వద్ద ఏర్పాటుచేసిన పటాకుల దుకాణంలో (Crackers shope) అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా పెరిగిన మంటలు.. పక్కనే ఉన్న దుర్గాభవాని ఫుడ్ జోన్కు (Food Zone) వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలడంతో మరో మూడు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో మొత్తం నాలుగు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
కాగా, ఒక్కసారిగా భారీ శద్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు భారీగా ఎగసి పడటంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.