పెద్దపల్లి : అప్పన్నపేట శివారులోని రాజరాజేశ్వర బాంబుల గోదాంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. బాంబుల గోదాం కావడంతో మంటలు భారీగా చెలరేగుతున్నాయి. పెద్దపల్లి, మంథని, రామగుండం నుంచి ఫైరింజన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. గోదాం మున్సిపల్ కౌన్సిలర్ ఇల్లందుల కృష్ణమూర్తికి చెందింది కాగా.. సంఘటనా స్థలం వద్ద రోదనలు మిన్నంటాయి. పెద్దపల్లి ఏసీపీ సాదుల సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐలు కే రాజేశ్, శ్రీనివాస్ సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.