Narayanepta | నారాయణపేట : ధన్వాడకు సమీపంలోని లింగంపల్లి భాగ్యలక్ష్మి పత్తి మిల్లులో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో రూ. కోట్ల విలువ చేసే పత్తి పూర్తిగా కాలిపోయింది. కేబుల్ వైరు తెగిపడి కరెంట్ షాక్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.
రైతులు, పత్తి వ్యాపారాలు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేసింది. ఈ అగ్నిప్రమాద ఘటనపై మిల్లు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. కోట్ల విలువ చేసే పత్తి కాలి బూడిదైందని, తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఇటీవలే కాటన్ కార్పొరేషన్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించారు. రైతులు పత్తి పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ACB Raids | రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ
Telangana | గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై స్పందించిన సర్కార్.. టాస్క్ఫోర్స్ ఏర్పాటు