హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి 21 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేసినట్టు తెలంగాణ మీడి యా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జర్నలిస్టుల సంక్షేమనిధి కమిటీ 5వ సమావేశాన్ని చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ.. ఆర్థిక సహాయం కోసం 29దరఖాస్తు లు వచ్చినట్టు తెలిపారు. వీటిలో 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు, ప్రమాదాలు, దీర్ఘకాలిక అనారోగ్యం బారినపడిన నలుగురు జర్నలిస్టులకు ఆర్థికసాయం అందజేయటానికి కమిటీ నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో సమాచారశాఖ జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జాప్యంపై అసంతృప్తి
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జర్నలిస్టులకు సమాచార, పౌర సంబంధాల శాఖ జారీచేసే అక్రెడిటేషన్ కార్డుల పునరుద్ధరణ, గడువు పొడిగింపులో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు మరోసారి విచా రించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అక్రెడిటేషన్ కార్డుల గడువును ఈ ఏడాది జూన్ 16 వరకు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేశారు.